Header Banner

అమెజాన్ ప్రైమ్‌ వినియోగదారులకు షాకింగ్ న్యూస్! అదనపు చెల్లింపు తప్పనిసరి!

  Tue May 13, 2025 15:47        Business

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో భార‌త్‌లోని త‌న‌ వినియోగదారులకు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ప్రైమ్ వీడియో కంటెంట్‌పై ప్రకటనలు తీసుకువస్తున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 17వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రసార‌మ‌య్యే సినిమాలు, టీవీ షోల మధ్యలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ వెల్ల‌డించింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ప్రకటనలు చూడటానికి ఇష్టపడని వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన యాడ్-ఫ్రీ ప్లాన్‌ను కూడా అమెజాన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాడ్-ఫ్రీ ప్లాన్ కోసం వినియోగదారులు అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!


ప్రకటనలు లేకుండా చూడాలనుకునేవారు అదనపు రుసుముతో కొత్త ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ నెలవారీగా రూ. 129 లేదా ఏడాదికి రూ. 699గా ఉంటుంద‌ని అమెజాన్ వెల్ల‌డించింది. ఇది యాడ్-ఆన్ ప్లాన్... రూ.1,499 ఖరీదు చేసే ప్రస్తుత అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వంపైన ఈ యాడ్ ఆన్ ప్లాన్ ను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ప్ర‌స్తుతం ఈ కొత్త ప్లాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా అందుబాటులో రాలేదు. ఈ మేర‌కు అమెజాన్ త‌న వినియోగదారులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం ప్రారంభించింది. "ఇది మేము ఆకర్షణీయమైన కంటెంట్‌లో పెట్టుబడి పెట్టడం కొనసాగించడానికి, ఆ పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు పెంచుకోవడానికి అనుమతిస్తుంది. టీవీ ఛానెళ్లు, ఇతర స్ట్రీమింగ్ సేవల కంటే అర్థవంతంగా తక్కువ ప్రకటనలను కలిగి ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం" అని సందేశాలు పంపుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AmazonPrime #ShockingUpdate #PrimeUsersAlert #OTTNews #StreamingUpdate #AdFreePlan #AmazonIndia